ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసు నిందితుడికి స్వాగతం పలికిన అధికారి.. పోలీసుల...

    Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసు నిందితుడికి స్వాగతం పలికిన అధికారి.. పోలీసుల సీరియస్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Phone Tapping Case | తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్​ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావు(Former SIB chief Prabhakar Rao) ఎట్టకేలకు హైదరాబాద్​ చేరుకున్నారు. సోమవారం ఆయన సిట్​ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అయితే పంజాగుట్ట పోలీసు స్టేషన్(Panjagutta Police Station)​లో ఫోన్​ ట్యాపింగ్​ కేసు నమోదు కాగానే అమెరికా పారిపోయిన ప్రభాకర్​రావు ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. రద్దు చేసిన పాస్​పోర్టు పునరుద్ధరించి, ఆయనకు వన్​టైం వీసా మంజూరు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశించింది. అలాగే అరెస్ట్​ నుంచి రక్షణ కల్పించింది. దీంతో ప్రభాకర్​ రావు హైదరాబాద్​ వచ్చారు.

    Phone Tapping Case | ఆ అధికారి తీరు చర్చనీయాంశం

    ఫోన్​ ట్యాపింగ్​ కేసులో 15 నెలలుగా పరారీలో ఉన్న ప్రభాకర్​రావు ఆదివారం రాత్రి శంషాబాద్​ ఎయిర్​పోర్టులో దిగారు. అక్కడ ఆయనకు కస్టమ్స్​ అధికారి(Customs officer) స్వాగతం పలకడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఓ కేసులో నిందితుడికి అధికారి ఎలా స్వాగతం పలుకుతారని ప్రశ్నలు తలెత్తున్నాయి. కాగా ఈ వ్యవహారంపై పోలీసులు సైతం సీరియస్​గా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు సదరు కస్టమ్స్​ అధికారిపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిసింది. దీంతో అతడిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా ఈ రోజ సిట్​ ఎదుట ప్రభాకర్​రావు విచారణకు హాజరు కానున్నారు. ఆయన ఏం చెబుతారనే ఉత్కంఠ నెలకొంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...