అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లాలోని సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో అశోక్ (DEO Ashok) అన్నారు. నగరంలోని బోర్గాం(పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (Zilla Parishad High School) గెజిటెడ్ హెడ్మాస్టర్లకు, జీవశాస్త్ర ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్ల బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు.
అనంతరం గెజిటెడ్ హెచ్ఎంలకు డాక్టర్ జలగం తిరుపతి రావు (Dr. Jalagam Tirupati Rao) ఆధ్వర్యంలో మోటివేషన్ తరగతులు (Motivation classes) నిర్వహించారు. జీవశాస్త్ర ఉపాధ్యాయులకు హెల్త్ ఎడ్యుకేటర్లు వెంకటేశ్వర్లు, స్వామిసులోచన అవగాహన కల్పించారు. లాటే షీటీం యాక్టివిటీస్ గురించి షీటీం ఎస్సై స్రవంతి అవగాహన కల్పించారు. సైకియాట్రిస్ట్ వివేక్ విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శిక్షణ కార్యక్రమంలో 95మంది హెచ్ఎంలు, 201 మంది బయోసైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సెంటర్ ఇన్ఛార్జి శంకర్ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది.
