అక్షరటుడే, ఇందూరు: School Admissions | వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగే విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని డీఈవో అశోక్ (DEO Ashoke) అన్నారు. బుధవారం బోర్గాం(పి) జడ్పీహెచ్ఎస్లో (Borgam(P) ZPHS) కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను పరిశీలించారు.
అనంతరం డీఈవో (DEO) మాట్లాడుతూ బోర్గాం(పి) ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితో కూడిన ఉపాధ్యాయ బృందం ఉత్తమ విద్యాబోధన అందిస్తున్నారన్నారు. దీంతో పాఠశాలలో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంటోందన్నారు. అడ్మిషన్లు దొరకని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇలా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర గణిత పరిశీలకుడు ప్రభాకర్ ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కోర్సు ఇన్ఛార్జి శంకర్ తదితరులు పాల్గొన్నారు.