అక్షరటుడే, ఇందూరు : Municipal Elections | ఎన్నికల సంఘం (Election Commission) నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలోని కంఠేశ్వర్ మున్సిపల్ జోన్ కార్యాలయం (Municipal Zone Office), టీటీడీ కల్యాణ మండపం (TTD Kalyana Mandapam)లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు.
నామినేషన్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి వెంటవెంటనే రోజువారిగా టీపోల్ యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. అభ్యర్థులు అన్ని వివరాలతో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేలా హెల్ప్‌డెస్క్ ద్వారా అవగాహన కల్పించాలని, సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు.
Municipal Elections | డివిజన్ ఓటరుగా నమోదై ఉండాలి
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సంబంధిత మున్సిపాలిటీ పరిధిలోని ఏదైనా డివిజన్/వార్డు ఓటరుగా నమోదై ఉంటే సరిపోతుందన్నారు. ప్రతిపాదకులు మాత్రం అదే డివిజన్‌కు చెందిన ఓటరై ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచామని, నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలన జరిపేలా అవసరమైన సిబ్బందిని నియమించామన్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా (Kamareddy District) ఇన్‌ఛార్జి కొనసాగుతున్న నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదటి రోజు ఆయా డివిజన్లో వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తదితరులున్నారు.