అక్షరటుడే, కామారెడ్డి : Municipal Elections | మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో బుధవారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నామినేషన్ కోసం కౌన్సిలర్ అభ్యర్థుల రాకతో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం (Kamareddy Municipal Office) కోలాహలంగా మారింది.
Municipal Elections | హెల్ప్‌డెస్క్ ఏర్పాటు..
నామినేషన్ వేసే అభ్యర్థుల కోసం కార్యాలయం ఆవరణలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అక్కడ అభ్యర్థులకు నామినేషన్ (Nomination) ప్రక్రియకు సంబంధించి వివరాలు అందజేస్తున్నారు. పట్టణంలో 49 వార్డుల్లో మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారిని ఏర్పాటు చేశారు. 49 వార్డులకు 17 మంది రిటర్నింగ్, 17 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. వార్డుల వారిగా నామినేషన్ స్వీకరణకు గదులను కేటాయించారు.
Municipal Elections | నోడ్యూ సర్టిఫికెట్ల కోసం..
అభ్యర్థులకు కావాల్సిన నో డ్యూ సర్టిఫికెట్ల (No Due Certificates) కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులకు కావాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వడానికి సమయం పడుతుండటంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నో డ్యూ సర్టిఫికెట్ల జారీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. నామినేషన్ స్వీకరణ సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ల సెంటర్ల వద్ద నిషేధాజ్ఞలు ఉన్నందున ఎక్కువమంది గుమిగూడకుండా ఉండే విధంగా పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు.