అక్షరటుడే, కమ్మర్పల్లి: Softball Tournament | మండల కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ (State level school games) అండర్–17 బాలబాలికల పోటీల్లో నిజామాబాద్ బాలబాలికల జట్లు ఛాంపియన్షిప్ను కైవం చేసుకున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ముగింపు కార్యక్రమానికి కమ్మర్పల్లి ఏఎంసీ ఛైర్మన్ పాలెపు నర్సయ్య విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
Softball Tournament | ఓడినవారు కుంగిపోవద్దు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో గెలుపోటములు సహజమని.. ఓడినవారు కుంగిపోవద్దన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో రాష్ట్రస్థాయి పోటీలు జరగడం సంతోషించదగ్గ విషయమన్నారు. మున్ముందు జాతీయ క్రీడలు సైతం నిర్వహించేందుకు సహకరిస్తామని ఆయన వెల్లడించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Volleyball Federation of India) వైస్ ప్రెసిడెంట్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో క్రీడల్లో పాల్గొనాలన్నారు. మంచి ఆలోచనలతో ఆడితే కచ్చితంగా విజయం సొంతం అవుతుందన్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ ఈ టోర్నీలో ఎంపికైన క్రీడాకారులు ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు ఛత్తీస్గడ్లో రాష్ట్రం బిలాస్పూర్లో జరిగే 69వ జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్బాల్ పోటీలలో పాల్గొంటారన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగమణి, ప్రధానోపాధ్యాయులు సాయన్న, ఎంపీడీవో రాజా శ్రీనివాస్, ఎంఈవో ఆంధ్రయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుంకేట రవి, ఎంపీడీవో రాజా శ్రీనివాస్, వీడీసీ అధ్యక్షుడు భోగ రామస్వామి, స్టేట్ అబ్జర్వర్స్ నాగరాజు, వీరేశం, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ (Softball Association) ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం, సాఫ్ట్బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి సుజాత, చిప్ప నవీన్, వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్, స్వప్న, దేవ సుకన్య, వీణ, జ్యోత్స్న, నరేష్, హెచ్ అనికేత్, ప్రీతి, సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు విక్రమ్, సీనియర్ సాఫ్ట్బాల్ క్రీడాకారుడు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
Softball Tournament | విజేతలు వీరే..
బాలుర విభాగంలో ప్రథమ స్థానం నిజామాబాద్, ద్వితీయ స్థానంలో వరంగల్, తృతీయ స్థానంలో అదిలాబాద్ జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానం నిజామాబాద్, ద్వితీయ స్థానంలో మెదక్, తృతీయ స్థానం మహబూబ్నగర్ జట్లు నిలిచాయి.
