అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gade Innaiah | మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అలియాస్ ఇన్నారెడ్డి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు (NIA Officers) మరోసారి సోదాలు నిర్వహించారు. జాఫర్‌గఢ్‌లో ఇన్నయ్య ఆశ్రమం, ఇంట్లో తనిఖీలు చేశారు.
మాజీ మావోయిస్ట్, సామాజిక కార్యకర్త గాదె ఇన్నారెడ్డిని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జనగామ (Janagama) జిల్లా జాఫర్గడ్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో డిసెంబర్ 21న అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్ట్ కాతా రామచంద్రారెడ్డి సంస్మరణ సభలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు మద్దతుగా గాదె ఇన్నారెడ్డి మాట్లాడారు. ఆయన రాజకీయ, సామాజిక అంశాలపై టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. పలు ఇంటర్వ్యూలలో మావోయిస్ట్‌లకు మద్దతుగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ (Operation Kagar)ను ఆయన వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.
Gade Innaiah | కస్టడీపై 16న తీర్పు
ఎన్ఐఏ అధికారులు ఇన్నయ్య అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టు (Nampally Court)లో ప్రవేశ పెట్టారు. కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఆయనను 5 రోజుల కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై ఈ నెల 16న నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. కాగా మావోయిస్టులతో సంబంధాలపై ఆయనను అధికారులు ప్రశ్నించనున్నారు. ఆపరేషన్ కగార్తో ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ (Maoist Party) బలహీనంగా మారింది. ఈ క్రమంలో పలువురు పట్టణాల్లో నక్సల్స్‌కు షెల్టర్లు ఇస్తున్నారు. ఇలాంటి విషయాలపై అధికారులు వివరాలు సేకరించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన ఇంట్లో మరోసారి సోదాలు నిర్వహించారు.