అక్షరటుడే, పెద్దకొడప్గల్ : Peddakodapgal Mandal | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) విజయం సాధించిన బీఆర్ఎస్ మద్దతుదారులైన సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే (Former MLA Hanmant Shinde) అన్నారు. మండలంలోని విఠల్వాడి గ్రామంలో (Vithalwadi Village) సర్పంచ్‌గా గెలిచిన శివాజీ రాథోడ్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు.
Peddakodapgal Mandal | ప్రజలకు సేవ చేయాలి..
విజయం సాధించిన సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి కోసం ప్రణాళికతో ముందుకు వెళ్లాలని హన్మంత్ షిండే సూచించారు. కేసీఆర్ (KCR) నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. అనంతరం అదేబాటలో ప్రస్తుత సర్పంచ్‌లు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రావణ్, హన్మంత్ రెడ్డి, రియాజ్, మహ్మద్, సాయి రెడ్డి, మాజీ సర్పంచ్‌లు కిషన్ పవర్, శంకర్ మహారాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.