ePaper
More
    HomeజాతీయంGreenfield Highway | విజయవాడ నుండి నాగపూర్‌ వరకు కొత్త‌ 4-లేన్‌ హైవే.. అక్క‌డ భూముల...

    Greenfield Highway | విజయవాడ నుండి నాగపూర్‌ వరకు కొత్త‌ 4-లేన్‌ హైవే.. అక్క‌డ భూముల ధరలకు రెక్క‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Greenfield Highway | విజయవాడ (Vijayawada) నుండి నాగపూర్‌ వరకు 4-లేన్‌ హైవే (4-lane highway) నిర్మాణం ప్రాజెక్టు కీలక మైలురాయిని చేరింది.

    ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడ, నంద్యాల, ఖమ్మం, కృష్ణా, నందివాడ జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాల‌లో భూసేకరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ మీదుగా నాగ్‌పూర్ వరకు యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్టు(Greenfield Highway Project)కి ఇప్ప‌టికే అనుమ‌తి వచ్చింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పనులు జరుగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణ ఆలస్యమవుతోంది. ఇంకా పనులు ప్రారంభంకాలేదు. భూసేకరణలో జాప్యం కారణంగా ఏడాది కిందటే ప్రారంభం కావాల్సిన పనులు ఇంకా మొదలు కాలేదు.

    Greenfield Highway | రెండేళ్ల‌లో ప‌నులు..

    భూసేకరణ ఆలస్యం అవుతుందని.. ముందుగా బ్రిడ్జిల నిర్మాణాన్ని ప్రారంభించాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్టులో విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా మంచిర్యాల వరకు కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ హైవే ఉంటుంది. ఆ తర్వాత మంచిర్యాల నుంచి నాగ్‌పూర్ (Nagpur) వరకు ఉన్న హైవే నిర్మాణం జరప‌నున్నారు. అయితే విజయవాడ నుంచి ఖమ్మం వరకు 90 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉండనుంది.

    ఇది ఖమ్మం (Khammam) జిల్లా సరిహద్దు నుంచి విజయవాడ బైపాస్‌లోని జక్కంపూడి దగ్గర కలుస్తుంది. ఈ 90 కిలో మీటర్ల హైవే పనుల్ని మూడు భాగాలుగా విభజించారు.. మొదటి రెండు భాగాలు ఖమ్మం జిల్లాలో ఉంటే.. అక్కడ ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. మూడో భాగమైన ఎన్టీఆర్ జిల్లాలో 29 కిలోమీటర్లకు సంబంధించి అవసరమైన భూసేకరణ మాత్రం జరగడం లేదు.

    ఎన్టీఆర్(NTR District) జిల్లా పరిధిలో ఈ హైవే కోసం 134 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో 12.17 హెక్టార్ల పట్టా భూములు, 9.24 హెక్టార్ల అసైన్డ్ భూములు సేకరించలేదు. అలాగే 13.25 హెక్టార్ల ప్రభుత్వ భూములను అప్పగించలేదు. ఈ భూముల కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఏడాదిన్నర కిందటే రూ.220 కోట్లు డిపాజిట్ చేశారు. ఆ వెంటనే ఎన్టీఆర్ జిల్లా జేసీ నిధి మీనా భూసేకరణ పనులు వేగవంతం చేశారు. ఆ తర్వాత ఆమె సెలవుపై వెళ్లడంతో భూసేకరణ ఆగిపోయింది.

    అయితే నేషనల్ హైవే(National Highway)కు సంబంధించి 90శాతం భూసేకరణ పూర్తి చేస్తేనే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ హైవేకు సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తి చేసి అప్పగిస్తే రెండేళ్లలో పనులు పూర్తి చేయొచ్చు అంటున్నారు

    More like this

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది...