అక్షరటుడే, కామారెడ్డి: Sindoor street | ఉగ్రవాదంపై కేంద్ర బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
పహల్గామ్లో (Pahalgam Terror Attack) పర్యాటకులపై జరిగిన దాడికి పాకిస్తాన్కు (Pakistan) భారత్ ధీటైన జవాబు ఇచ్చింది. పాకిస్తాన్లోని (Pakistan) ఉగ్రవాద శిబిరాలపై భారత్ నేరుగా దాడులు చేసి 100కు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) పేరు మారుమోగుతోంది.
ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలోని(Kamareddy) ఓ కాలనీకి ‘సింధూర్ వీధి’ (Sindoor Street) పేరు పెట్టి తమ దేశభక్తిని చాటుకున్నారు. భారత సైనికులు చూపిన తెగువను స్ఫూర్తిగా తీసుకుని జీవితాంతం వారి సాహసాన్ని గుర్తించుకునేలా తమ కాలనీకి ‘సింధూర్ వీధి’ అని పేరు పెట్టుకున్నామని కాలనీవాసులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ కాలనీ పేరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.