అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Former MP Anjan Kumar | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ (Anjankumar Yadav) తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. 40 ఏళ్లుగా పార్టీ కోసం కష్డపడి పని చేస్తుంటే గుర్తింపు లేకుండా పోయిందని ఆయన వాపోయారు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన ఆయనకు భంగపాటే ఎదురైంది.
నవీన్ యాదవ్‌కు కాంగ్రెస్ పార్టీ (Congress Party) టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలపై అలకబూనారు. శుక్రవారం తనను కలిసిన విలేకరులతో అంజన్‌కుమార్ మాట్లాడుతూ.. తన ఆవేదన వెల్లగక్కారు. కాంగ్రెస్ అభ్యర్థిని (Congress Candidate) ఎంఐఎంతో పాటు మరో పార్టీ నాయకుడు కలిసి నిర్ణయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Former MP Anjan Kumar | గుర్తింపు కూడా లేదా?
జూబ్లీహిల్స్ (Jubilee Hills) టికెట్ ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరానని, కానీ కనీసం తన పేరును కూడా పరిశీలించలేదని అంజన్‌కుమార్ తెలిపారు. పోటీ చేస్తానన్న అభ్యర్థులతో కనీసం మాట కూడా మాట్లాడలేదని అసహనం వ్యక్తం చేశారు. అవకాశం ఇవ్వకపోయినా టికెట్ ఆశించిన వారితో మాట్లాడాలి కదా? అని ఆయన ప్రశ్నించారు. పార్టీలో మాకు కనీస గౌరవం లేదా? అని పేర్కొన్నారు.
Former MP Anjan Kumar | వేరే పార్టీల ఒత్తిడితో..
నవీన్ యాదవ్ పేరును ఖరారు చేయడంపై అంజన్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వేరే పార్టీల ఒత్తిడికి తలొగ్గి ఎంపిక చేసిందని సంచలన వ్యాఖ్యానించారు. దమ పార్టీ అభ్యర్థిని ఎంఐంఎంతో పాటు మరో పార్టీకి చెందిన వ్యక్తి నిర్ణయించారని వెల్లడించారు. ఇలాగైతే పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌లో ఉన్నా కనీసం గౌరవం ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. భవిష్యత్తు కార్యాచరణపై తన అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.