అక్షరటుడే, బాన్సువాడ : Banswada | పట్టణంలోని నూతన ప్రభుత్వ ఆస్పత్రి (New Government Hospital)కి అనుసంధానంగా నిర్మించనున్న మార్చురీ గదిని గతంలో ఉన్న స్థలంలోనే నిర్మించాలని బీజేపీ నాయకులు (BJP Leaders) డిమాండ్ చేశారు. వేరే చోట నిర్మిస్తే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.
Banswada | హాస్టల్ దగ్గరగా నిర్మించవద్దు
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతలో మార్చురీ ఉన్నస్థలంలోనే కొత్త భవనం నిర్మించాలని.. ఈ మార్చురీని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల వద్ద నిర్మించడానికి ప్రయత్నిస్తే ఊరుకోమని పేర్కొన్నారు. అనేక మంది విద్యార్థులు భయాందోళనకు గురవడమే కాకుండా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. అటువంటి పరిస్థితులు మళ్లీ రాకుండా గతంలో ఉన్న స్థలంలోనే మార్చురీ గది (Mortuary Room)ని నిర్మించి, చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థుల సంరక్షణ కోసం బీజేపీ (BJP) ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు.