అక్షరటుడే, ఇందూరు : Mock Drill Nizamabad | వరదలు, విపత్తుల సమయాల్లో చేపట్టాల్సిన తక్షణ చర్యలపై మాక్‌డ్రిల్ నిర్వహించినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. జిల్లాలోని రఘునాథ చెరువు, జీజీహెచ్, బోధన్ మండలం హంగార్గా శివారులో సోమవారం ఎన్డీఆర్ఎఫ్, ఎన్సీసీ ఆపదమిత్ర వలంటీర్లు, వైద్యులు మాక్‌డ్రిల్ నిర్వహించారు.
Mock Drill Nizamabad | అప్రమత్తత కోసం..
విపత్తుల సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్టం నివారించేలా మాక్‌డ్రిల్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. అన్ని శాఖల పరస్పర సమన్వయంతో ఆచరణాత్మక రూపంలో చేసి చూపించారు. డ్రోన్లు, వాటర్ బోట్లు, అంబులెన్స్, అగ్నిమాపక శకటాలు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందింపజేశారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato) క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Mock Drill Nizamabad | వరదల్లో చిక్కుకున్న వారి కోసం..
వరద జలాల్లో చిక్కుకుపోయిన వారిని నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారిని కాపాడి వారికి తక్షణ వైద్య సేవలు సహాయక చర్యలు చేపట్టే కార్యక్రమాలు ప్రత్యక్షంగా చేసి చూపించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (Government General Hospital)లో పేషెంట్లను హుటాహుటిన పైఅంతస్తులకు చేర్చి వారి ప్రాణాలను ఎలా కాపాడాలనే అంశాలపై మాక్‌డ్రిల్ చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన అబ్జర్వర్ సురేష్ కుమార్ కార్యక్రమాన్ని పరిశీలించారు.