అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి ఈగల్ టీం (Eagle Team) పనిచేస్తోంది. ఎప్పటికప్పుడు విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. దందాకు పాల్పడుతున్న ముఠాల గుట్టు రట్టు చేస్తోంది. తాజాగా.. గంజాయి తీసుకుంటూ ఓ ప్రజాప్రతినిధి కుమారుడు దొరికాడు.
ఈగల్ టీమ్ తనిఖీల్లో ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడడం చర్చనీయాశమైంది. హైదరాబాద్ నగరంలోని నానక్రామ్గూడ (Nanakramguda)లో నిర్వహించిన తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్లోని జమ్మలమడుగు ఎమ్మెల్యే అయిన ఆదినారాయణరెడ్డి (MLA Adinarayana Reddy) కుమారుడు సుధీర్ రెడ్డి దొరికాడు. తనిఖీల సమయంలో గంజాయి తీసుకుంటూ చిక్కిన ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఆయనను ఈగల్ టీమ్ డీఅడిక్షన్ సెంటర్ (De-addiction Center)కు తరలించినట్లు తెలిసింది.