అక్షరటుడే, వెబ్డెస్క్ : TMC MLA | పశ్చిమ బెంగాల్లో ఓ ఎమ్మెల్యే గోడ దూకి పారిపోవడానికి యత్నించాడు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) జిబన్ కృష్ణ సాహా ఇంట్లో తనిఖీ చేయడానికి ఈడీ అధికారులు సోమవారం వచ్చారు.
వారిని చూసిన ఆయన గోడ దూకి పారిపోవడానికి యత్నించారు. పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. వేలాది మంది ఉపాధ్యాయులను అక్రమంగా నియమించారని ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఆ నియామకాలను సుప్రీంకోర్టు (Supreme Court) రద్దు చేసింది. ఈ క్రమంలో కేసు విచారణలో ఈడీ దూకుడు పెంచింది.
TMC MLA | ఈడీ దాడులతో..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఉపాధ్యాయుల నియామక స్కామ్ (Teacher Recruitment Scam) వ్యవహారంలో పలువురు నాయకుల ఇళ్లలో సోదాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ముర్షిదాబాద్ జిల్లాలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా (MLA Jiban Krishna Saha) ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోమవారం దాడులు చేపట్టారు. అయితే ఈడీ అధికారులు వస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తమ ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకాడు. అనంతరం గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే బయట కాపలా ఉన్న అధికారులు ఆయనను పట్టుకున్నారు.
TMC MLA | ఫోన్ చెరువులో పడేసిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కృష్ణ సాహా తన దగ్గర ఉన్న ఆధారాలు చేరిపేయడానికి యత్నించారు. తన వద్ద ఉన్న ఫోన్‌ను చెరువులోకి విసిరేశాడు. ఆయన దగ్గర ఉన్న మరో రెండు ఫోన్లను ఈడీ అధికారులు (ED Officers) స్వాధీనం చేసుకున్నారు. ఆయనను అరెస్ట్ చేసి ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరుస్తామన్నారు.
TMC MLA | ఏమిటీ ఈ స్కామ్
బెంగాల్ ప్రభుత్వం 2016లో భారీగా ఉపాధ్యాయులను భర్తీ చేసింది. 24,650 ఖాళీల భర్తీ కోసం పరీక్ష చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే ఇందులో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి.