అక్షరటుడే, వెబ్‌డెస్క్: Medaram Jathara | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రులు సీతక్క(Minister Seethakka ), కొండా సురేఖ (Minister Konda Surekha) గురువారం కలిశారు. మేడారం జాతరకు రావాలని ఆయనను ఆహ్వానించారు.
మేడారం మహా జాతర (Medaram Maha Jatara) జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ వేడుక కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే జాతరకు రావాలని ప్రభుత్వం పలువురికి ఆహ్వానాలు అందిస్తోంది. ఇందులో భాగంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ గురువారం ఎర్రవల్లిలో కేసీఆర్ (KCR) వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. వారికి మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు కేసీఆర్‌ను కలిశారు. ఆయనకు శాలువా కప్పి, మేడారం జాతర ఆహ్వాన పత్రిక అందించారు.
Medaram Jathara | ఆత్మీయ ఆహ్వానం
తన ఇంటికి వచ్చిన మంత్రులకు కేసీఆర్ సాదర ఆహ్వానం పలికారు. పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం చేశారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మంత్రులు, కాసేపు మాట్లాడారు. అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు. మంత్రులు మాట్లాడుతూ.. కేసీఆర్‌ని అసెంబ్లీలో కలవలేకపోయాం అన్నారు. అందుకే నేరుగా వెళ్లి మేడారం జాతరకు రావాలని ఆహ్వానించామని తెలిఆపరు. మన సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద ఆదివాసీ జాతర అన్నారు. కేసీఆర్ నివాసానికి వెళ్లిన తమకు చీరలు పెట్టడం సంతోషంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు.