ePaper
More
    HomeతెలంగాణRRR | మరింత విస్తరించనున్న మహానగరం.. కొత్తగా మూడు సిటీలు

    RRR | మరింత విస్తరించనున్న మహానగరం.. కొత్తగా మూడు సిటీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: RRR | హైదరాబాద్(Hyderabad)​ మహా నగరాన్ని మరింత విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఓఆర్​ఆర్​ వరకు గ్రేటర్​ పరిధి విస్తరించగా.. తాజాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆర్​ఆర్​ఆర్(RRR)​ వరకు నగరాన్ని విస్తరించాలని భావిస్తోంది. దీని కోసం కొత్తగా మూడు మున్సిపల్​ కార్పొరేషన్లను సైతం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

    హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో కొత్తగా మూడు సిటీలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు(Municipalities), గ్రామాల వివరాలు సేకరిస్తోంది. ఇందుకోసం ఇటీవల అధికారులు సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. జీహెచ్​ఎంసీ(GHMC)తో పాటు నగరం చుట్టు పక్కల గల కార్పొరేషన్​లు, మున్సిపాలిటీల వివరాలపై ఆరా తీసినట్లు సమాచారం.

    RRR | మేయర్​ ఎన్నిక ఎలా..

    ప్రస్తుతం జీహెచ్​ఎంసీ పాలకవర్గం పదవీకాలం వచ్చే ఫిబ్రవరి వరకు ఉంది. అప్పటిలోగా కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం(Government) యోచిస్తోంది. అయితే మూడు కార్పొరేషన్లకు ఒకరే మేయర్​ను పెట్టాలా.. ముగ్గురు మేయర్లను పెట్టాలా అని ఆలోచిస్తోంది. జనవరిలోగా కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా.. జీహెచ్​ఎంసీ పాలకవర్గం గడువు ముగియగానే ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికలు పెట్టనున్నట్లు సమాచారం.

    RRR | సగం జనాభా ఇక్కడే..

    ఆర్ఆర్​ఆర్(RRR)​ పరిధిలో దాదాపు రెండు కోట్ల జనాభా ఉంది. రాష్ట్రంలోని సగం జనాభా ఇక్కడే ఉంది. దీంతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను విలీనం చేసి కార్పొరేషన్​లు ఏర్పాటు చేస్తే అభివృద్ధికి ఇబ్బందులు ఉండవని యోచిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు కసరత్తు ప్రారంభించారు.

    More like this

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...