అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, వైద్యులు దేవుళ్లతో సమానమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం (Mla Pocharam Srinivar reddy) అన్నారు. డీసీహెచ్ఎస్, బాన్సువాడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
Mla Pocharam | పేదలకు సేవచేయడం అదృష్టం..
ప్రభుత్వ ఆస్పత్రిలో (government hospitals) పేద ప్రజలకు సేవ చేవ చేయడం అదృష్టంగా భావించాలని ఎమ్మెల్యే సూచించారు. అలాంటి సేవ చేసే అవకాశం ఉన్న వైద్యశాఖలో విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ పొందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, నాయకులు కృష్ణారెడ్డి, మోహన్ నాయక్, ఎజాజ్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.