అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maoists Surrender | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) ఎదుట 20 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సరెండర్ అయిన వారిలో పలువురు కీలక నేతలు ఉన్నాయి. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి, ఆయన సతీమణి ఈశ్వరితో పాటు గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సే దేవా (Barse Deva) అలియాస్ సుక్కతో పాటు మొత్తం 20 మంది సరెండర్ అయ్యారు.
Maoists Surrender | ఆయుధాలు స్వాధీనం
పోలీసుల ఎదుట మొత్తం 20 మంది లొంగిపోగా.. వారిలో పీఎల్‌జీఏ ఫస్ట్ బెటాలియన్ నుంచి 10 మంది మావోలు ఉన్నారు. ఇక టీఎస్‍సీ నుంచి ముగ్గురు, ఎస్ఎస్‌జెడ్‌బీ నుంచి ఇద్దరు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ నుంచి ఐదుగురు ఉన్నారు. కాగా.. వీరి వద్ద నుంచి 48 మౌంటెడ్ ఎంఎల్‌జీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులను డీజీపీ కార్యాలయం (DGP Office)లో మీడియా ముందు ప్రవేశపెట్టారు.
Maoists Surrender | తుడిచిపెట్టుకుపోయిన పీఎల్‌జీఏ బెటాలియన్
డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ (Maoist Party)కి ఇది భారీ ఎదురుదెబ్బ అని డీజీపీ తెలిపారు. పీఎల్‌జీఏ బెటాలియన్ తుడిచిపెట్టుకుపోయిందని వెల్లడించారు. పీఎల్‌జీఏ బెటాలియన్‌లో మొత్తం 400 మందికి పైగా ఉండేవారని.. ప్రస్తుతం 66 మంది మాత్రమే మిగిలారన్నారు. రాజిరెడ్డి సరెండర్‌తో తెలంగాణ స్టేట్ కమిటీ (Telangana State Committee) దాదాపు కొలాప్స్ అయిందన్నారు. ప్రస్తుతం స్టేట్ కమిటీలో ఒక్కరే ఉన్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు వీరంతా లొంగిపోయినట్లు డీజీపీ తెలిపారు.
మావోయిస్టు పార్టీకి చెందిన PLGA బెటాలియన్ పూర్తిగా క్షీణించింది. గతంలో 400 మందికి పైగా సభ్యులు ఉండగా..ప్రస్తుతం 66 మంది మాత్రమే ఉన్నారు. నాయకత్వం కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చారు కాబట్టి మిగిలిన వారు ఆలోచించుకోవాలి. వారికి ప్రభుత్వం, పోలీసుశాఖ తరుపున సహకరిస్తాం.#TelanganaPolice pic.twitter.com/j8xdUrJULB
— Telangana Police (@TelanganaCOPs) January 3, 2026