అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kalvakuntla Kavitha | రాష్ట్రంలో సాగు నీటి కాలువల (irrigation canals) నిర్వహణ సక్రమంగా లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. కాలువల్లో పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే ఎస్సారెస్పీ స్టేజీ -2 కాలువలను (SRSP Stage-2 canals) శనివారం కవిత పరిశీలించారు. అనంతరం వెలుగుపల్లి గ్రామంలోని రుద్రమ చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కాలువల నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) గానీఒక్కపైసా విడుదల చేయలేదన్నారు. ఆపరేషన్, మెయింటెనెన్స్ విభాగానికి కనీసం నిధులు ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kalvakuntla Kavitha | చెరువును పట్టించుకోవడం లేదు
కోదాడ వరకు నీళ్లు ఇచ్చే డిస్ట్రిబ్యూటరీ కాలువ 70 కిలోమీటర్లు ఉంటుందని కవిత తెలిపారు. ఈ కాల్వను సరిగా మెయింటెన్ చేయటం లేదని విమర్శించారు. 700 ఎకరాల్లోని రుద్రమ దేవి చెరువుకు గోదావరి నీళ్లు రావాల్సి ఉందన్నారు. కానీ కిలోమీటర్‌కు పైగా డిస్ట్రిబ్యూటరీ కాలువ తవ్వకపోవటం కారణంగా నీళ్లు రావటం లేదని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పెద్దలు ఈ చెరువును 5 టీఎంసీల రిజర్వాయర్ చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ కూడా ఈ చెరువును లక్నవరం మాదిరిగా టూరిస్ట్ ప్లేస్ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ ప్రస్తుతం చెరువును పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ స్టేజ్ టూ లో భాగంగా నల్గొండ జిల్లాలో రిజర్వాయర్లు రావాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు.
Kalvakuntla Kavitha | ఆస్పత్రి పరిశీలన
తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను కవిత సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న వంద పడకల ఆస్పత్రని పరిశీలించి నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి కారణాలు ఆరా తీశారు.