అక్షరటుడే, వెబ్డెస్క్: Heart Attack | హార్ట్ ఎటాక్/గుండెపోటు కేసులు చాలా పెరిగి పోయాయి. చూస్తుండగానే ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వస్తుందని అందరూ భావిస్తారు. కానీ తాజా పరిశోధన ప్రకారం.. అరుదుగా యాదృచ్ఛికంగానే అలా జరుగుతుంది.
ముందస్తు చర్యలు తీసుకుంటే హార్ట్ ఎటాక్ (Heart Attack) ముప్పు తప్పించుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. దాదాపు 99% కేసులను కేవలం నాలుగు నివారించగల ప్రమాద కారకాల ద్వారా గుర్తించవచ్చని వెల్లడైంది. ది లాన్సెట్లో ప్రచురించబడిన, సైన్స్అలర్ట్ నివేదించిన ఇటీవలి పెద్ద-స్థాయి అంతర్జాతీయ అధ్యయనంలో గుండెపోటు రావడానికి అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, అధిక చక్కెర నిల్వలు, ధూమపానమే కారణమని తేలింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని హృదయ సంబంధ మరణాలకు ఈ నాలుగే కారణమవుతున్నాయి.
Heart Attack | గుండెపోటు కారకాలు..
స్ట్రోక్ రావడానికి నాలుగు ప్రమాద కారకాలు ఉన్నాయి. అవి అధిక రక్తపోటు (బీపీ), అధిక కొలెస్ట్రాల్, అధిక రక్త చక్కెర (షుగర్), ధూమపానం (స్మోకింగ్). వీటిని నిశ్శబ్ధ హంతకులుగా అభివర్ణిస్తారు. ఇవి క్రమంగా రక్తనాళాలను కుదించి, ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తాయి. ఆకస్మిక హృదయ సంబంధ సంఘటనలను ప్రేరేపించే అడ్డంకులను సృష్టిస్తాయి. సాధారణంగా ఆయా రుగ్మతలు తమకు ఉన్నాయని చాలా మందికి తెలియదు. అందువల్లే ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. అదే బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నాయని తెలిస్తే వాటిని నియంత్రణలో ఉంచుకుంటారు. తద్వారా హార్ట్ ఎటాక్ ముప్పు నుంచి తప్పించుకుంటారు.
Heart Attack | అధిక రక్తపోటు(బీపీ)
అధిక రక్తపోటు (High Blood Pressure) ప్రాణాంతకంగా మారింది. రోగులు ఆరోగ్యంగా కనిపించిప్పటికీ, వారి ధమనులు అప్పటికే అపారమైన ఒత్తిడికి లోనవుతాయి. బీపీని నియంత్రించకుండా వదిలేస్తే అది గుండె వైఫల్యం, స్ట్రోక్ లేదా మూత్రపిండాల వ్యాధికి దారి తీస్తుంది. ఈ ముప్పు తప్పించుకోవాలంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారైనా రక్తపోటును తనిఖీ చేయించుకోవాలి. 120/80 mmHg కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి.
Heart Attack | అధిక కొలెస్ట్రాల్
శరీర పనితీరుకు కొలెస్ట్రాల్ చాలా అవసరం. కానీ చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol) ధమనులలో కొవ్వు నిల్వలు ఏర్పడ నికి కారణమవుతుంది. కాలక్రమేణా ఈ నిక్షేపాలు చీలిపోయి రక్త ప్రవాహాన్ని నిరోధించే గడ్డలను ఏర్పరుస్తాయి. ఇది గుండెపోటుకు ప్రధాన కారణంగా మారుతుంది. కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూసుకోవాలి. వ్యాయామం చేయడంతో పాటు కొవ్వు పెంచే ఆహారాలను దూరం పెట్టాలి. గింజలు, ఆలివ్ నూనె, చేపల నుండి ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో భాగం చేసుకోవాలి.
Heart Attack | అధిక చక్కెర నిల్వలు (షుగర్)
రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రణలో ఉంచుకోవాలి. స్వల్ప పెరుగుదల కూడా కాలక్రమేణా రక్త నాళాలను దెబ్బతీస్తుంది. డయాబెటిస్ (Diabetes) డయాబెటిస్ అథెరోస్కిరోసిస్ను వేగవంతం చేస్తుంది, ధమనుల గట్టిపడడం, సంకుచితం కావడం వల్ల గుండెపోటుకు దారి తీస్తుంది. అందుకే క్రమం తప్పకుండా షుగర్ టెస్ట్ చేయించాలి.
Heart Attack | ధూమపానం
ధూమపానం ధమనుల గోడలను దెబ్బతీస్తుంది, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు ఒక సిగరెట్ తాగినా (Cigarette Smoking) గుండెపోటును తీసుకొస్తుంది. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ధూమపానం మానేయాలి. దీని వల్ల గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది.
Heart Attack | చిన్న మార్పులు, పెద్ద ఫలితాలు
తరచూ సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర నిల్వలను క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండడం వంటి వాటి వల్ల గుండె పోటు ప్రమాదాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఉప్పు, చక్కెర తీసుకోవడం తగ్గించడం, వాకింగ్ చేయడం చిన్న, స్థిరమైన మార్పులు కూడా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి.