అక్షరటుడే, వెబ్‌డెస్క్: Weather Updates | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడింది. ఇది తుపాన్‌గా మారనున్నట్లు వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ఈ నెల 5న ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం శ్రీలంక (Sri Lanka)లోని హంబన్‌టోటాకు 410, చెన్నైకి నైరుతి దిశగా 980 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.
పశ్చిమ-వాయువ్య దిశగా శ్రీలంక వైపు కదులుతోంది. శుక్రవారం తీవ్ర వాయుగుండం తుపాన్‌గా మారే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు (IMD Officers) అంచనా వేశారు. ఒకవేళ ఇది తుపాన్‌గా బలపడితే అర్ణబ్ అని పేరు పెట్టనున్నారు. శ్రీలంకలో పొట్టువిల్, ట్రింకోమలి మధ్యలో తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది.
Weather Updates | భారీ వర్ష సూచన
తీవ్ర వాయుగుండం ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తమిళనాడు (Tamil Nadu) , కేరళ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) పడుతాయని అధికారులు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)పై సైతం దీని ప్రభావం ఉంటుందన్నారు. కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో పొగ మంచు కురుస్తుందని, చలి పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.