అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic Stock Market)లో మూడు రోజుల నష్టాలకు తెరపడిరది. గురువారం ప్రధాన సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 428 పాయింట్లు, నిఫ్టీ 140 పాయింట్లు పెరిగాయి.
సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్ తొలుత అస్థిరంగా కదలాడినా.. తర్వాత కోలుకుంది. ఈ క్రమంలో మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడిరది. అన్ని రంగాల షేర్లు రాణించాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 65, నిఫ్టీ (Nifty) 13 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటల వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు ఆ తర్వాత క్రమంగా పైకి ఎగబాకాయి. చివరికి సెన్సెక్స్(Sensex) 428 పాయింట్ల లాభంతో 84,818 వద్ద, నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 25,898 వద్ద స్థిరపడ్డాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,448 కంపెనీలు లాభపడగా 1,742 స్టాక్స్ నష్టపోయాయి. 151 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 85 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 166 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 15 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 11 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
ఆటో, మెటల్ స్టాక్స్‌లో దూకుడు..
కొనుగోళ్ల మద్దతుతో ఆటో, మెటల్ స్టాక్స్ రాణించాయి. బీఎస్ఈలో మెటల్ ఇండెక్స్ 1.17 శాతం, ఆటో 1.08 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.97 శాతం, కమోడిటీ 0.94 శాతం, టెలికాం 0.89 శాతం, ఐటీ 0.87 శాతం, రియాలిటీ 0.71 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.14 శాతం నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.79 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.57 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.51 శాతం లాభంతో ముగిశాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో ఉండగా.. 8 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎటర్నల్ 2.74 శాతం, టాటా స్టీల్ 2.56 శాతం, కొటక్ బ్యాంక్ 2.45 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.27 శాతం, మారుతి 1.23 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఆసియా పెయింట్ 0.91 శాతం, ఎయిర్టెల్ 0.65 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.45 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.31 శాతం, పవర్‌గ్రిడ్ 0.24 శాతం నష్టపోయాయి.