ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad | 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన చిరుత..

    Hyderabad | 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన చిరుత..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​ నగరంలో 12 రోజులుగా అధికారులకు నిద్ర లేకుండా చేసిన చిరుత (Leopard) ఎట్టకేలకు చిక్కింది. నగరంలోని గోల్కొండ, ఓఆర్​ఆర్​ సమీపంలో గల మృగవాని పార్క్​, గ్రే హౌండ్స్​ ప్రాంతాల్లో కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దానిని పట్టుకోవడానికి అధికారులు అనేక చర్యలు చేపట్టారు. తాజాగా మంచిరేవుల (Manchirevula)లో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దానిని నల్లమల అడవుల్లో (Nallamala Forest) వదిలేస్తామని ప్రకటించారు.

    Hyderabad | ముప్పు తిప్పలు పెట్టి..

    నగర శివారులో 12 రోజుల క్రితం చిరుత సంచరిస్తుండగా కొందరు గమనించారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గోల్కొండ (Golconda), లంగర్​హౌస్​ శివారులోని ఆర్మీ స్థావరాలు, అజీజ్​ నగర్​ సమీపంలో గల మృగవాని పార్క్ (Mrugavani Park)​ అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు దానిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే చిరుత అధికారుల చేతికి చిక్కకుండా నగరంలో చక్కర్లు కొడుతూ ముప్పు తిప్పలు పెట్టింది.

    READ ALSO  Musi River | మూసీ నదిని ఆక్రమించి షెడ్ల నిర్మాణం.. కూల్చివేతలు చేపట్టిన హైడ్రా

    Hyderabad | 8 ట్రాప్​ కెమెరాలు.. 4 బోన్లు

    చిరుతను పట్టుకోవడానికి అధికారులు 8 ట్రాప్​ కెమెరాలు, నాలుగు బోన్లు ఏర్పాటు చేశారు. 12 రోజులుగా దాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు రంగారెడ్డి జిల్లా గండిపేట (Gandipet) మండలం మంచిరేవులలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. దీంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుతను నల్లమల అటవీ ప్రాంతంలో వదిలి పెట్టనున్నారు.

    Latest articles

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    Coolie Trailer | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. విల‌న్‌గా మారి అద‌ర‌గొట్టిన కింగ్‌ నాగార్జున

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Trailer | సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) సినిమా వస్తోంది అంటే...

    ENGvIND | ఇంగ్లండ్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన జైస్వాల్, ఆకాశ్.. భార‌త్ ఆధిక్యం ఎంతంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ENGvIND | ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ (Anderson-Tendulkar Trophy) చివరి టెస్టు (ఓవల్...

    Kamareddy SP | పగలు ఐస్​క్రీంలు అమ్ముతూ.. రాత్రిళ్లు చోరీలు చేస్తూ..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | పగలంతా ఐస్ క్రీములు అమ్మి రెక్కీ నిర్వహిస్తూ.. రాత్రుళ్లు చోరీలకు పాల్పడుతున్న...

    More like this