అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kite Festival | తెలంగాణలో టూరిజంని ప్రమోట్ చేయడం కోసమే స్వీట్, కైట్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ షో నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ జరుగుతుందన్నారు.
కైట్, స్వీట్ ఫెస్టివల్‌పై మంత్రి జూపల్లి (Minister Jupally) బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌కు వస్తున్న పర్యాటకులు రెండు మూడు రోజులు నగరంలో ఉండేలా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పర్యాటక శాఖ సంక్రాంతి పండుగ సందర్భంగా అంతర్జాతీయ గాలిపటాలు మరియు స్వీట్స్ ఉత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ ఉత్సవం జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ (Secunderabad Parade Grounds)లో జరగనుందని చెప్పారు.
Kite Festival | వివిధ దేశాల నుంచి..
కైట్ ఫెస్టివల్లో 19 దేశాల నుంచి పలువురు పాల్గొంటారని చెప్పారు. 15 రాష్ట్రాల నుంచి 40 మంది అంతర్జాతీయ, 55 మంది జాతీయ గాలిపటాల నిపుణులు హాజరవుతారన్నారు. ఈ మూడు రోజులలో ప్రత్యేకంగా రూపొందించిన గాలిపటాలతో రాత్రిపూట ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు. స్థానిక కళాకారులకు మద్దతుగా సుమారు 100 చేనేత, హస్తకళల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 60 ఫుడ్ కోర్టులు తెలంగాణ (Telangana) వంటకాలతో పాటు ఇతర ప్రాంతాల వంటకాలను అందిస్తాయి. స్వీట్ ఫెస్టివల్లో 1,200 రకాలకు పైగా స్వీట్లను ప్రదర్శించనున్నారు.
Kite Festival | హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
జనవరి 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. ఉదయం సెషన్‌లు హైదరాబాద్ (Hyderabad) శివార్లలో జరుగుతాయి, సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో నైట్ గ్లో బెలూన్ ప్రదర్శనలు ఉంటాయని మంత్రి తెలిపారు. జనవరి 16, 17 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ షో జరగనుంది.