MLC Kavitha
MLC Kavitha | కవిత దీక్షను విజయవంతం చేయాలి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: MLC Kavitha | బీసీ బిల్లు సాధన కోసం జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చేపట్టనున్న దీక్షను సక్సెస్​ చేయాలని యూటీఎఫ్​, జాగృతి నేతలు (UTF, Jagruti leaders) పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్​లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

అనంతరం యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులు, జాగృతి అధ్యక్షుడు సాల్వా చారి, అవంతి కుమార్, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఈనెల 4, 5, 6, 7 తేదీల్లో హైదరాబాద్​లోని (Hyderabad) ఇందిరాపార్క్ (Indira park)​ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయనున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local body elections) 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ ఆమె దీక్ష తలపెట్టారన్నారు.

MLC Kavitha | బీసీల బోనమెత్తుకున్న బహుజన బతుకమ్మ కవితమ్మ..

బీసీల బోనమెత్తుకున్న బహుజన బతుకమ్మ కవితమ్మ అని.. సామాజిక ఉద్యమాల్లో ముందునుంచే కవిత చురుకుగా పాల్గొన్నారని యూటీఎఫ్​, జాగృతి నాయకులు గుర్తు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్​లో (Kamareddy Declaration) భాగంగా బీసీలకు 42 శాతం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రస్తుతం నోరు మెదపడం లేదన్నారు.

తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కవిత అన్ని జిల్లాల్లో బీసీ కులాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, అనేక ధర్నాలు, బీసీ మేధావులతో సమావేశాలు నిర్వహించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేషన్ కమిటీకి సమగ్ర నివేదికను కూడా అందజేయడం వల్లే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశంపై చలనం వచ్చిందన్నారు.

సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు దర్శనం దేవేందర్, తెలంగాణ శంకర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి భరద్వాజ్, నాయకులు పంచరెడ్డి మురళి, హరీష్ యాదవ్, ఆకాష్, శోభ, సరిత, రేఖ, రాణి,సంతోష్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్, నాయకులు చంద్రకాంత్, మీసాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.