అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pulasa Fish | వర్షాకాలం వచ్చిదంటే గోదావరి జిల్లాల్లో (Godavari District) పులస చేపల గురించే చర్చ జరుగుతోంది. వానాకాలంలో మాత్రమే దొరికే పులస చేపలకు గోదావరి జిల్లాలో మంచి డిమాండ్ ఉంటుంది. పుస్తెలు అమ్మయినా సరే పులస తినాలినే నానుడి ఉంది. దీంతో చాలా మంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. వేలంలో వేల రూపాయలు పెట్టి పులస చేపలను దక్కించుకుంటారు.
యానాం గౌతమి (Yanam Gautami) గోదావరికి ఎర్ర నీరు పోటెత్తడంతో మత్స్యకారులకు పులస చేపలు (Pulasa Fish) చిక్కుతున్నాయి. ఈ క్రమంలో యానాంలో వేటకు వెళ్లిన మల్లాడి ప్రసాద్ అనే మత్స్యకారుడికి సుమారు రెండు కేజీల బరువున్న పులస చిక్కింది. దీనికి వేలం నిర్వహించగా.. పొన్నమండ రత్నం అనే మహిళ రూ.22 వేలకు దానిని దక్కించుకుంది. దీంతో ఆ మత్స్యకారుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Pulasa Fish | ఎందుకంత ప్రత్యేకం
పులస చేపలు అత్యంత రుచికరంగా ఉంటాయి. ఇవి బంగాళాఖాతం నుంచి సంతానోత్పత్తి కోసం గోదావరిలోకి వస్తాయి. నీటి ప్రవాహానికి ఎదురీదుతూ వచ్చి గోదావరిలో గుడ్లు పెడతాయి. అనంతరం మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతాయి. అయితే ఇవి గుడ్డు పెట్టడానికి వచ్చే సమయంలో మత్స్యకారులు (Fishermens) పట్టుకుంటారు. జులై నుంచి సెప్టెంబర్ మధ్య మాత్రమే పులస చేపలు లభిస్తాయి.
ఈ చేపలు సముద్రంలో ఉన్నప్పుడు విలసలు అంటారు. అప్పుడు రుచి మాములుగానే ఉంటుంది. అయితే సంతానోత్పత్తి కోసం గోదావరిలో ఎదురీదుతున్న సమయంలో ఇలి పులసగా మారుతాయి. ఆ సమయంలో వీటి రుచి కూడా మారుతుంది. ఈ చేపలు వలలో పడగానే చనిపోతాయి. అయినా కూడా రెండు రోజులకు వరకు పాడుకాకపోవడం పులస చేపల ప్రత్యేకత. ధవళేశ్వరం బ్యారేజ్(Dhavaleswaram Barrage) నుంచి గోదావరి సముద్రంలో కలిసే మధ్యలోనే ఈ చేపలు దొరుకుతాయి. ఒక్క పులస చేప దొరికినా చాలని మత్స్యకారులు భావిస్తారు.