అక్షరటుడే, ఇందూరు: Jagannath Rath Yatra | జై జగన్నాథ్.. (Jai Jagannath) జై జై జగన్నాథ్.. హరే రామ్.. హరే కృష్ణ.. నినాదాలతో ఇందూరు నగరం మార్మోగింది. ఇస్కాన్ కంఠేశ్వర్ (Kanteswar) కేంద్రం ఆధ్వర్యంలో గురువారం జగన్నాథ రథయాత్ర వైభవోపేతంగా కొనసాగింది.
నగరంలోని కంఠేశ్వర్ ఆలయం వద్ద పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) రథయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి రైల్వే కమాన్(Railway Comman), ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్(Railway station), బస్టాండ్, గాంధీచౌక్, పెద్ద బజార్, ఆర్ ఆర్ చౌరస్తా మీదుగా పులాంగ్, విజయలక్ష్మి గార్డెన్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా కళాకారుల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, దేవతామూర్తుల వేషధారణ భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. రథయాత్రకు ప్రముఖ ప్రవచనకర్త ప్రణవానంద దాస్(Orator Pranavananda Das) హాజరయ్యారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ (RSS Vibhag Pracharak) వెంకట శివకుమార్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ(Former MLA Yendala Lakshminarayana), స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ప్రముఖ ప్రవచనకర్త ప్రణవానంద దాస్

రథయాత్రను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న సీపీ సాయిచైతన్య

రథయాత్రలో భాగంగా నృత్యప్రదర్శన ఇస్తున్న కళాకారిణులు

రథాన్ని లాగుతున్న భక్తులు