అక్షరటుడే, వెబ్డెస్క్ : Cold Wave | రాష్ట్రంలో చలి వణికిస్తోంది. మధ్యాహ్నం పూట సైతం చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) అలెర్ట్ జారీ చేశారు.
రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు చలి పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ నెల 18 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని చెప్పారు. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదు అవుతాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ (North Telangana) జిల్లాల్లో 7 డిగ్రల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదు అయ్యే అవకాశం ఉంది. పశ్చిమ తెలంగాణలో 7-9 డిగ్రల కంటే తక్కువకు పడిపోతుందని అధికారులు తెలిపారు.
Cold Wave | తీవ్ర ఇబ్బందులు
రాష్ట్రంలో పది రోజులుగా కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. అయితే రానున్న నాలుగు రోజులు దీని ప్రభావం మరింత ఉండనుంది. ఇప్పటికే చలి తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల వరకు చలి వీడటం లేదు. సాయంత్రం 5 అయిందంటే చాలు వణికిస్తోంది. మధ్యాహ్నం పూట సైతం చలిగాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం యాసంగి సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే చలితీవ్రతతో రైతులు, వ్యవసాయ కూలీలు అవస్థలు పడుతున్నారు.
Cold Wave | జాగ్రత్తలు పాటించాలి
రానున్న నాలుగు రోజులు చలి మరింత పెరుగుతుందని చెప్పడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుండటంతో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు వెచ్చని దుస్తులు ధరించాలని, చలి పూట బయటకు వెళ్లొద్దు అంటున్నారు. గుండె, శ్వాసకోస సంబంధ వ్యాధులు ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం మాత్రమే బయటకు వెళ్లాలి.