అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | రూపాయి రికవరీ, చాలా రోజుల తర్వాత ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు నెట్ బయ్యర్లుగా మారడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కాస్త బలపడిరది. దీంతో కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) కోలుకుంది.
గురువారం ఉదయం సెన్సెక్స్ 41 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై మరో 280 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోలుకుని 437 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో మొదలై మరో 38 పాయింట్లు నష్టపోయింది. అక్కడినుంచి 137 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 102 పాయింట్ల లాభంతో 84,662 వద్ద, నిఫ్టీ (Nifty) 45 పాయింట్ల లాభంతో 25,863 వద్ద ఉన్నాయి.
ఐటీలో కొనుగోళ్ల మద్దతు
బీఎస్ఈలో క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ 1.07 శాతం, ఐటీ ఇండెక్స్ 0.89 శాతం, సర్వీసెస్ 0.61 శాతం, మెటల్ 0.56 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.45 శాతం పెరిగాయి. ఆటో, పవర్ ఇండెక్స్‌లు 0.95 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.82 శాతం, యుటిలిటీ 0.78 శాతం, ఇండస్ట్రియల్ 0.71 శాతం, ఎనర్జీ 0.44 శాతం నష్టాలతో ఉన్నాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.15 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.14 శాతం లాభంతో, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం నష్టంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 15 కంపెనీలు లాభాలతో ఉండగా.. 15 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
టీసీఎస్ 1.33 శాతం, ఇన్ఫోసిస్ 1.33 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.81 శాతం, టెక్ మహీంద్రా 0.80 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.73 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : సన్‌ఫార్మా 2.53 శాతం, ఎంఅండ్ఎం 1.42 శాతం, పవర్‌గ్రిడ్ 1.38 శాతం, ఎన్టీపీసీ 0.86 శాతం, బీఈఎల్ 0.60 శాతం నష్టాలతో ఉన్నాయి.