అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ఉండడం, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు వరుసగా నికర కొనుగోలుదారులుగా నిలుస్తుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) లాభాల బాటలో పయనించింది. ఐటీ ఇండెక్స్‌లు వరుసగా నాలుగో సెషన్లోనూ లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 216 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 456 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 89 పాయింట్ల లాభంతో స్వల్పంగా 8 పాయింట్లు తగ్గినా.. పుంజుకుని మరో 133 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 638 పాయింట్ల లాభంతో 85,567 వద్ద, నిఫ్టీ 206 పాయింట్ల లాభంతో 26,172 వద్ద స్థిరపడ్డాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,794 కంపెనీలు లాభపడగా 1,5155 స్టాక్స్ నష్టపోయాయి. 192 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 143 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 129 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 3.30 లక్షల కోట్లు పెరిగింది.
ఐటీలో కొనసాగిన జోరు..
దేశీయ స్టాక్ మార్కెట్లో ఐటీ సెక్టార్లో జోరు కొనసాగుతోంది. బీఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 1.72 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.65 శాతం, ఇండస్ట్రియల్ 1.33 శాతం, మెటల్ 1.32 శాతం, కమోడిటీ 1.05 శాతం, పీఎస్‌యూ 0.92 శాతం, ఇన్ఫ్రా 0.90 శాతం లాభంతో ముగిశాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.12 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.86 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.73 శాతం లాభపడ్డాయి.
Tor Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 26 కంపెనీలు లాభాలతో ఉండగా.. 4 కంపెనీలు నష్టపోయాయి. ట్రెంట్ 3.56 శాతం, ఇన్ఫోసిస్ 3.06 శాతం, ఎయిర్టెల్ 2.32 శాతం, టెక్ మహీంద్రా 2.09 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.67 శాతం పెరిగాయి.
Losers : ఎస్బీఐ 0.60 శాతం, కొటక్బ్యాంక్ 0.37 శాతం, ఎల్టీ 0.07 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.05 శాతం నష్టపోయాయి.