అక్షరటుడే, వెబ్‌డెస్క్ : T20 World Cup | వచ్చే ఏడాది జరగనున్న టీ 20 వరల్డ్ కప్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అనుహ్యంగా శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టింది. టీమిండియా టీ 20లో సత్తా చాటుతోంది. గత టీ 20 వరల్డ్ కప్‌ను రోహిత్ నేతృత్వంలోని జట్టు కైవసం చేసుకుంది. దీంతో మరోసారి సైతం కప్ గెలవాలని భారత్ జట్టు పట్టుదలతో ఉంది.
ఈ క్రమంలో తాజాగా జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్‌కు (Suryakumar Yadav) జట్టు పగ్గాలు అప్పగించింది. గత కొంతకాలంగా విఫలం అవుతున్న అతడిపై యాజమాన్యం నమ్మకం ఉంచింది. ఆల్‌రౌండర్ అక్షర్‌పటేల్‌కు (Axar Patel) వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. అక్షర్ కొంతకాలంగా జట్టు అవసరాలకు అనుగుణంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌లో సైతం కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.
T20 World Cup | గిల్‌కు మొండిచెయ్యి
భారత ఓపెనర్, టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు (Shubman Gill) బీసీసీఐ మొండి చేయి చూపింది. టీ 20 ప్రపంచ కప్‌కు అతడిని ఎంపిక చేయలేదు. అలాగే భారత యువ క్రికెటర్ యశస్వీ జైశ్వాల్‌కు సైతం చోటు దక్కలేదు. కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న ఈషాన్ కిషన్‌ను బీసీసీఐ (BCCI) ఎంపిక చేసింది. అతడు ఇటీవల సయ్యద్ ముస్తాన్ అలీ ట్రోఫీలో రాణించాడు. దీంతో అవకాశం లభించింది. కాగా టీ 20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7న స్టార్ట్ అయ్యి మార్చి 8న తుది పోరు జరగనుంది.
T20 World Cup | భారత్, శ్రీలంక వేదికగా..
టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు భారత్, శ్రీలంక వేదికగా జరగనున్నాయి. పాకిస్థాన్ జట్టు తన మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న యూఎస్ఏతో ఆడనుంది. 12న నమీబియాతో, 15న పాక్‌తో, 18న నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది. సూపర్ 8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 వరకు జరగనున్నాయి. టీ 20 వరల్డ్ కప్‌కు ముందు భారత్‌లో న్యూజిలాండ్ జట్టు (New Zealand Team) పర్యటించనుంది. ఇందులో భాగంగా 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ టీ20 సిరీస్‌కు కూడా వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన జట్టే ఆడనుంది.
T20 World Cup | భారత జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్‌కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (కీపర్), తిలక్‌వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దుబే, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్‌సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (కీపర్).