అక్షరటుడే, నిజాంసాగర్: Singitham Reservoir | రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగుల్లోకి క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది. మహమ్మద్‌నగర్ (Mahammad nagar) మండలంలోని సింగితం రిజర్వాయర్‌లోకి వరద వచ్చి చేరుతోంది. దీంతో పాటుగా నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి (Nizamsagar Project) కూడా ఎగువ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం 581 క్యూసెక్కుల నీరు నిజాంసాగర్‌లోకి వచ్చింది. మరికొన్ని రోజుల్లోనే ప్రాజెక్ట్‌లు జలకళను సంతరించుకోనున్నాయి.
