అక్షరటుడే, వెబ్‌డెస్క్: Viral Video | ప్రస్తుతం వర్షాకాలం (rainy season) కావడంతో నిత్యం వాన పడుతోంది. మరోవైపు వర్షం కురుస్తున్నా కూడా పిల్లలు స్కూల్‌కి వెళ్లాల్సిందే. ఉద్యోగులు ఆఫీసులకి వెళ్లడం ఆగడం లేదు.
అయితే ఎక్కువగా వర్షంలో తడవడంతో పిల్లలు జబ్బు పడే అవకాశం ఉంది. మరోవైపు వర్షం పడ్డప్పుడు స్కూల్ బ్యాగ్ (school bag) తడవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో పిల్లలు తడవకుండా అపార్ట్‌మెంట్ వారు చేసిన ఆలోచన అందరిని ఆకట్టుకుంటుంది.
Viral Video | సరికొత్త ఆలోచన
వర్షం పడుతున్న సమయంలో స్కూల్ బస్సు నుంచి దిగిన పిల్లలు తడవకుండా ఇంటికి చేరేలా ఒక వినూత్న ‘మూవింగ్ టెంట్’ సోషల్ మీడియాలో (Social Media) హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోను @chicagobachi అనే ఎక్స్ యూజర్ తన హ్యాండిల్‌లో షేర్ చేశారు. వీడియోలో స్కూల్ బస్సు (School Bus) నుంచి దిగి మూవింగ్ టెంట్ ద్వారా చాలా మంది పిల్లలు అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లారు. పిల్లలు తడవకుండా ఉండేందుకు టెంట్‌ను ఒక ట్రాక్ మీద నడిపేలా తీర్చిదిద్దడం చాలా బాగుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బాగా వర్షం పడిన, గాలి వచ్చిన కూడా ఆ టెంట్ ఎగిరిపోకుండా తీర్చిదిద్దడం విశేషం. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. “అదిరిపోయిన ఆలోచన”, “ఇది దేశం మొత్తం అనుసరించాల్సిన పద్ధతి”, “ఇది లో బడ్జెట్ ప్రభుత్వ స్కూల్‌లకు (government schools) ఉపయోగపడుతుంది” అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. భారతీయుల సృజనాత్మకతని ఇప్పుడు ప్రపంచం మొత్తం గుర్తించింది. చిన్న సమస్యలకు పెద్ద పెట్టుబడి లేకుండా పరిష్కారాలు చూపుతుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. వర్షం సమయంలో పిల్లల భద్రత, ఆరోగ్యం (Health), బడ్జెట్ పరిమితుల మధ్య తీసుకున్న ఈ చక్కటి నిర్ణయం తల్లిదండ్రుల హృదయాలను గెలుచుకుంది.
వర్షం వచ్చే టైంలో స్కూలు పిల్లలు తడవకుండా . ఐడియా బాగుంది కదా . pic.twitter.com/OzlIKBm6pM
— Bhaskar Reddy (@chicagobachi) August 22, 2025