అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలోని నల్లకుంటలో దారుణం చోటు చేసకుంది. అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. పిల్లల ముందే భార్యపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.
నల్గొండ జిల్లా (Nalgonda District) హుజురాబాద్‌కు చెందిన వెంకటేష్, త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ దంపతులు బతుకుదెరువు కోసం నగరంలోని నల్లకుంట (Nallakunta)లో నివాసం ఉంటున్నారు. వెంకటేష్ తన భార్యను తరచూ అనుమానించేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో త్రివేణి భర్తను వదిలి పుట్టింటికి వెళ్లింది.
Hyderabad | మారానని చెప్పి..
వెంకటేశ్ అత్తారింటికి వెళ్లి తాను మారానని చెప్పాడు. భార్యను బాగా చూసుకుంటానని నమ్మించాడు. దీంతో అతడి మాటలు నమ్మి ఆమె భర్త వెంట హైదరాబాద్ వచ్చింది. నగరానికి వచ్చిన తర్వాత వెంకటేష్ మళ్లీ గొడవ పడటం మొదలుపెట్టారు. నిత్యం ఆమెను కొట్టేవాడు. ఈ క్రమంలో అనుమానంతో త్రివేణితో గొడవ పడి దాడి చేశాడు. అనంతరం పెట్రోల్ (Petrol) పోసి నిప్పటించాడు. పిల్లల ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన కూతురిని సైతం మంటల్లోకి తోసేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
Hyderabad | నిందితుడి అరెస్ట్
మంటలు అంటుకోవడంతో త్రివేణి కేకలు పెట్టింది. దీంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు. తల్లీకూతుళ్లను ఆస్పత్రికి తరలించారు. అయితే త్రివేణి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గాయపడ్డ ఆమె కూతురుకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు వెంకటేష్‌ను అరెస్ట్ చేశారు.