అక్షరటుడే, వెబ్డెస్క్ : AP High Court | తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి కేసు (TTD Parakamani Case)లో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని చోరీ చేసిన వ్యవహారంపై మంగళవారం విచారణ జరిగింది.
రవికుమార్ అనే వ్యక్తి హుండీ నగదు లెక్కిస్తూ.. భారీగా విదేశీ కరెన్సీ చోరీ చేశాడు. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం వచ్చాక కేసు నమోదు అయింది. ఇటీవల కేసు హైకోర్టుకు గతంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసు నమోదుకు ఏసీబీ (ACB) , సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ వ్యవహారంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం టీటీడీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు సమంజసం కాదని చెప్పింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బాధ్యత ఉండదని పేర్కొంది. దీంతోనే పరకామణిలో ఘటన జరిగిందని తెలిపింది. విరాళాల కౌంటింగ్లో టేబుల్ ఏర్పాటు చేయాలని సూచించింది. విరాళాల కౌంటింగ్ కోసం భక్తులను ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది.
AP High Court | దొంగతనం కన్నా ఎక్కువ
టీటీడీలో ఏఐ, సాంకేతిక పరిజ్ఞానం వాడుకలోకి తీసుకురావాలని ధర్మాసనం సూచించింది. పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించిందని అభిప్రాయ పడింది. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అప్రమత్తమయ్యే విజిలెన్స్ టెక్నాలజీ (Vigilance Technology) తీసుకురావాలని ఆదేశించింది. కౌంటింగ్లో టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించింది. అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
భక్తులు సమర్పించే కానులను లెక్కించే సమయంలో రవికుమార్ అనే ఉద్యోగి విదేశీ కరెన్సీ (Foreign Currency) కాజేశాడు. వైసీపీ హయాంలో దీనిని లోక్ అదాలత్లో పరిష్కరించారు. అయితే కూటమి సర్కార్ వచ్చాక దీనిపై కేసు నమోదు చేసింది. సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. రాజీకి గల కారణాలను వారు విచారించారు. ఈ క్రమంలో తాను తప్పు చేసినట్లు రవికుమార్ ఓ వీడియో కూడా విడుదల చేశాడు.