అక్షరటుడే, బాన్సువాడ : Komuram Bheem | గిరిజనుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు కొమురంభీం అని నాయక్‌పోడ్ సంఘం కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పెంకటి గణేష్ అన్నారు.
బాన్సువాడ (Banswada) మండలంలోని హన్మాజీపేట్ గ్రామంలోని ఆదివాసీ నాయకులు, గిరిజన సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం కొమురం భీం వర్ధంతిని నిర్వహించారు. విప్లవ వీరుడు కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పెంకటి గణేష్ (Penkati Ganesh) మాట్లాడుతూ.. జల్, జంగల్ జమీన్ నినాదంతో ఆడబిడ్డల హక్కుల కోసం, గిరిజనుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గోండు వీరుడు కొమురం భీం (Komuram Bheem) అని అన్నారు. ఆయన దేశానికి గర్వకారణమని, గిరిజనుల ఆత్మగౌరవ ఉద్యమాలకు మార్గదర్శకుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి కొంకి గణేష్, సంఘ అధ్యక్షుడు కొంకి సాయిలు, సభ్యులు గంగాధర్, పోచయ్య, శుభాష్, చిరంజీవి, రాజు, లింగం, ప్రవీణ్, సాయిరాం, శ్రీకాంత్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.