అక్షరటుడే, వెబ్‌డెస్క్: groom jump : బీహార్ రాష్ట్రం మోతీహరి జిల్లాలోని ఒక గ్రామంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాయిలెట్ కు వెళ్లి వస్తానని చెప్పి పెళ్లి పందరి నుంచి వరుడు పారిపోయాడు. పెళ్లి వేడుక నుంచి వరుడు అదృశ్యమవడంతో గందరగోళం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పెళ్లి నిలిచిపోయింది.
కాగా, ఈ విషయమై ఉదయం సర్పంచ్ పంచాయితీ పెట్టి, వరుడిని పిలిపించారు. వివరణ కోరగా.. అతడు చెప్పిన విషయం విని అంతా షాక్ అయ్యారు. తన కాలు బెణికిందని, డాక్టర్ వద్దకు వెళ్లానని వరుడు చెప్పగా, అతడు చెప్పిన మాటలను ఎవరూ నమ్మలేదు. వేరే అమ్మాయితో సంబంధం ఉండడం వల్లే పారిపోయినట్లు భావిస్తున్నారు. చివరికి అమ్మాయి తరఫువారు సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం.
