అక్షరటుడే, ఇందూరు: Dasarathi Krishnamacharya | తెలంగాణలో నిజాం అరాచకాలను తన కలంతో ఎదిరించిన మహాకవి దాశరథి అని చరిత్ర పరిశోధకులు (History researchers) కందకుర్తి యాదవరావు అన్నారు.
ఇతిహాస సంకలన సమితి (Ithihasa Sankalana Samithi) ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని కోటగల్లిలోని కార్యాలయంలో దాశరథి కృష్ణమాచార్యుల జయంతి (Dasarathi Krishnamacharya) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ రోజుల్లో నిజాం దుర్మార్గపు పాలనను ప్రశ్నిస్తూ.. ప్రజలను చైతన్యం చేశారన్నారు. దాశరథి కృష్ణమాచార్యులను తొలుత వరంగల్ జైల్లో బంధించి చిత్రహింసలకు గురి చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా జైలుకు తరలించారని, ఇక్కడి జైలు గోడల మీద బొగ్గుతో తన కవితలు రాసి సమాజాన్ని చైతన్యం చేశారన్నారు.
Dasarathi Krishnamacharya | దాశరథి ఒక యోధుడు..
దాశరథి కేవలం కవి కాదని ఉద్యమకాంక్షను ప్రజల గుండెల్లో రగిలించిన యోధుడని ఇతిహాస సంకలన సంస్థ జిల్లా అధ్యక్షుడు నరేష్ కుమార్ కొనియాడారు. ఇలాంటి మహాయోధుడిని నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్య అధ్యక్షుడు మోహన్ దాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కందకుర్తి ఆనంద్, జిల్లా కార్యదర్శి డాక్టర్ మర్రిపల్లి భూపతి, రాజేష్, మిలింద్, వీరేశం తదితరులు పాల్గొన్నారు.