45
అక్షరటుడే, ఇందూరు : Ayyappa Padipuja | డిచ్పల్లి మండలం (Dichpally Mandal)లోని యానంపల్లి గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప సేవా సమితి (Ayyappa Seva Samithi) ఆధ్వర్యంలో దుబ్బాక జ్యోతిష్య పండితుడు అల్లాడి శ్రీనివాస్ స్వామి అధ్యక్షతన గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో కార్యక్రమం జరిపారు.
Ayyappa Padipuja | మహాభిక్ష..
మహాపడి పూజ సందర్భంగా గ్రామం మొత్తం అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయింది. కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వాములకు మహాభిక్ష ఏర్పాటు చేశారు. మహాపడి పూజ కార్యక్రమానికి జిల్లాలోని స్వాములు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి యానంపల్లి (Yanamapalli)గ్రామాభివృద్ధి కమిటీ సహకారం అందజేసింది. గ్రామస్థులు సైతం స్వచ్ఛంగా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేశారు.
