HomeతెలంగాణRation Cards | ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై అలా చేస్తే రేషన్​ కార్డు కట్​

Ration Cards | ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై అలా చేస్తే రేషన్​ కార్డు కట్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ration Cards | రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్​ కార్డుల new ration cards జారీకి కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను ration cards application పరిశీలిస్తున్న అధికారులు అర్హలకు రేషన్​ కార్డులు మంజూరు చేయడానికి చర్యలు చేపట్టారు. పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల నమోదు​ ప్రక్రియ కొనసాగుతోంది.

Ration Cards | సన్నబియ్యం పంపిణీ

రేషన్​ కార్డుల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు వాటిని అమ్ముకుంటున్నారని కాంగ్రెస్​ ప్రభుత్వం సన్నబియ్యం sanna biyyam pampini పంపిణీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్​ దుకాణాల ration shops ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అయితే ఆ బియ్యాన్ని కూడా కొందరు విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలా రేషన్​ బియ్యం విక్రయిస్తున్న వారిపై ప్రభుత్యం చర్యలకు సిద్ధమైంది. రేషన్​ బియ్యం అమ్ముకుంటున్న వారి కార్డులు తొలగించాలని నిర్ణయించింది.

Ration Cards | 11 రేషన్​ కార్డులు రద్దు

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఆచలాపూర్​లో రేషన్​ బియ్యం అమ్ముకున్న 11 మంది కార్డులను అధికారులు రద్దు చేశారు. డీలర్​ నుంచి బియ్యం తీసుకున్న వీరు కేజీ రూ.16 చొప్పున విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారి కార్డులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Must Read
Related News