అక్షరటుడే, బాన్సువాడ: Ration Cards | అన్ని వర్గాల సంక్షేమమే సర్కారు ధ్యేయమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam srinivas Reddy) అన్నారు. పట్టణంలోని రెడ్డి సంఘంలో శనివారం బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
Ration Cards | పేదలందరికీ రేషన్ కార్డులు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు అందజేస్తోందని పోచారం తెలిపారు. మొదటి విడతలో మొత్తం 1,599 మందికి నూతన రేషన్ కార్డులు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ (Agro Industries Chairman Kasula Balaraj), సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub Collector Kiranmayi), బీర్కూర్ ఏఎంసీ (Birkur AMC) ఛైర్మన్ శ్యామల, మున్సిపల్ మాజీ ఛైర్మన్ గంగాధర్, నార్ల సురేష్, ఎజాజ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.