అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని కీలక ఫ్లై ఓవర్ పేరు మార్చాలని నిర్ణయించింది.
నగరంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ (Telugu Thalli Flyover) పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దిగువ ట్యాంక్ బండ్-సెక్రెటేరియట్ను కలిపే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నగరంలో కీలకమైంది. 1.1 కిలోమీటర్ల పొడవు ఉన్న దీని మీదుగా రద్దీ అధికంగా ఉంటుంది.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో ఈ ఫ్లై ఓవర్ పేరును తెలుగు తల్లి ఫ్లై ఓవర్ అని పెట్టారు. తాజాగా పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చడానికి బుధవారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది.
Hyderabad | కీలక నిర్ణయాలు
జీహెచ్ఎంసీ (GHMC) స్టాండింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్కే పురం ఆర్వోబీ, ఆర్యూబీ వద్ద 45 అడుగుల రహదారి విస్తరణ కోసం 52 ఆస్తుల భూమిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. మౌల్ అలీలోని జీహెచ్ఎంసీ వార్డ్ కార్యాలయం మొదటి అంతస్తులో పోలీస్ స్టేషన్ ఏర్పాటు, యాకుత్పురా వద్ద లండన్ వంతెన పునర్నిర్మాణానికి రూ.2.95 కోట్లు మంజూరు చేయడం వంటి తీర్మానాలను ఆమోదించింది.