Homeజిల్లాలునిజామాబాద్​Jeevan Reddy | ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది : మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

Jeevan Reddy | ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది : మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి పంటలను కొనుగోలు చేయాలని ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి డిమాండ్​ చేశారు. లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్ : Jeevan Reddy | రైతుల ఉసురుతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కొట్టుకుపోతుందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర పెంచకుండా.. ఉన్న ధర ఇవ్వడం లేదని మండి పడ్డారు.

వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇప్పటికీ పరిహారం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు రోడ్ల వెంబడి ఆరబోస్తున్నారని పేర్కొన్నారు. వర్షాలకు చేతికొచ్చిన పంట తడిసిపోతుందన్నారు. రైతులకు గిట్టుబాట ధర చెల్లించి పంట కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఆర్మూర్ గడ్డ నుంచి ఉద్యమం చేస్తామన్నారు. కలెక్టర్​ కార్యాలయాలన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. హామీలు అమలు చేయని రేవంత్ సర్కార్​కు గుణపాఠం చెప్పడానికి రోజులు దగ్గర్లో ఉన్నాయని జీవన్​ రెడ్డి అన్నారు.