Homeజిల్లాలునిజామాబాద్​Mla Dhanpal | ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

Mla Dhanpal | ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఇందూరు ఫుట్​బాల్​ అకాడమీ (Indur Football Academy) ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల (Polytechnic College) మైదానంలో ఫుట్​బాల్​ టోర్నమెంట్ (Football tournament) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందూరులో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు కొదవలేదని పేర్కొన్నారు.

క్రీడలను ప్రోత్సహించడం వల్ల విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలతో మినీస్టేడియం (Mini stadium) కావాలని, ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానన్నారు. త్వరలో నిర్మాణమయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు శిక్షకులను నియమించాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎర్రం సుధీర్, బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.