ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLingampet | తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

    Lingampet | తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ (Lingampet BJP) మండల అధ్యక్షుడు బొల్లారం క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు.

    లింగంపేట మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పేరుమీద పార్టీ పెట్టి తొమ్మిదేళ్లు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించకుండా మరో నిజాం లాగా కేసీఆర్ ​(KCR) చరిత్రలో నిలిచిపోయారన్నారు.

    కాంగ్రెస్ పార్టీ గెలిచి సుమారు రెండేళ్లు కావస్తున్నా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం ఆ పార్టీ వైఫల్యంగా చెప్పుకోవచ్చన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్​ చేశారు.

    కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు జక్సని దత్తు రాములు, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్ల రామచంద్ర చారి, బీజేవైఎం మండల అధ్యక్షుడు మార్గం రజనీకాంత్, ఓబీసీ మోర్చా (OBC Morcha) మండల అధ్యక్షుడు ఆంధ్యాల ఉదయ్, మండల ప్రధాన కార్యదర్శిలు ఆకుల విష్ణువర్ధన్, మార్గం సుభాష్, లింగంపేట పట్టణ అధ్యక్షుడు తిరుమల నరేష్, మండల సీనియర్ నాయకులు చేపూరి పోశెట్టి, బీజేపీ మాజీ అధ్యక్షుడు వడ్ల ఎల్లేశం, మోతే మల్లయ్య, బూత్ అధ్యక్షులు సంతోష్, బొల్లు గణేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Konda Surekha | ఎమ్మెల్యే నాయినిపై మంత్రి కొండా విమర్శలు.. ధర్మకర్తలను భర్తీ చేసే స్వేచ్ఛ లేదా? అని ప్రశ్న

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Surekha | వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై...

    hidden treasures | పురాతన బసవేశ్వర ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు..!

    అక్షరటుడే, భిక్కనూరు : hidden treasures | చారిత్రాత్మక ప్రదేశాలు historical places, ఆలయాల్లో temples గుప్త నిధుల...

    Hyderabad | హైదరాబాద్​లో వర్షం.. భారీగా ట్రాఫిక్​ జామ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వాన దంచికొట్టింది. దీంతో...