అక్షరటుడే, కామారెడ్డి: Ex Mla Gampa Govardhan | భారీ వర్షాలపై ప్రభుత్వం ముందే హెచ్చరించి ఉండాల్సిందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ప్రభుత్వం ముందే హెచ్చరిస్తే ఇంత నష్టం జరిగేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
పట్టణంలోని తన నివాసంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగ పూట కామారెడ్డి నియోజకవర్గంలో వరదలు ప్రళయం సృష్టించాయన్నారు. వరదల ధాటికి ప్రజలు తట్టుకోలేకపోయారని, ఈ నష్టం ఎవరు పూడ్చలేనిదని ఆయన విచారం వ్యక్తం చేశారు. వరదలతో నియోజకవర్గంలో నలుగురు చనిపోయారని తెలిపారు.
Ex Mla Gampa Govardhan | సీతక్క ఇలావచ్చి అలా వెళ్లడం సరికాదు..
వరదల సమయంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించలేదని, భోజనం, నీళ్లు కూడా అందించలేదని బాధితులు తెలిపారని గంపగోవర్ధన్ పేర్కొన్నారు. జీఆర్ కాలనీలో సంగమేశ్వర్ గ్రామానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు కుటుంబంతో చిక్కుకుపోయాడని, ఇంటికి వెళ్లే పరిస్థితి లేకపోతే తన కారులో పంపించినట్లు తెలిపారు. ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క (Incharge Minister Seethakka) కాలనీలో తూతూమంత్రంగా పర్యటించారని ఆరోపించారు. ఇలా వచ్చి అలా వెళ్లి ఊరుకోవడం సరికాదన్నారు.
Ex Mla Gampa Govardhan | ఒక్కో ఇంటికి రూ.లక్ష ఆర్థికసాయం ఇవ్వాలి
జీఆర్ కాలనీలో (GR colony) 48 ఇళ్లకు ఒక్కొక్క ఇంటికి రూ.11,500 ఇస్తామని కలెక్టర్ ప్రకటించారని, ఆ సహాయం దేనికి సరిపోతుందో వారే చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఒక్కో ఇంటికి రూ.లక్ష సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందించే యోచనలో ప్రభుత్వం ఉందని, ఒక్కొక్క కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయారని, ఒక్కో ఎకరానికి ప్రభుత్వం రూ.10 వేలు ఇచ్చే యోచనలో ఉందని, ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Ex Mla Gampa Govardhan | రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలి
చెడిపోయిన రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేసి అందుబాటులోకి తేవాలని గంప గోవర్ధన్ డిమాండ్ చేశౄరు. రాజంపేట (Rahjampet) పునరావాస కేంద్రంలో భోజనం సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. బాధితులకు భోజన వసతి కల్పించాలన్నారు. కాలనీవాసులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో సహాయం చేయాల్సింది పోయి ప్రజలనే తప్పు పట్టేలా ఎమ్మెల్యే కేవీఆర్ (MLA KVR) మాట్లాడడం సరికాదన్నారు. చేతనైతే ఆదుకోవాలి తప్ప ప్రజలే తప్పు చేశారనడం ధర్మం కాదన్నారు.
జీఆర్ కాలనీ ఇళ్లకు అనుమతులు ఏ ప్రభుత్వ హయాంలో ఇచ్చారో రికార్డులు చూడాలని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. బతుకమ్మ కుంట, రుక్మిణి కుంటలు ప్రతి ఏడాది నీటి ముంపునకు గురవుతాయని, ఆ కాలనీలు ఎప్పుడు నిర్మించారో చూడాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లవెల్లి అశోక్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ కుంబాల రవి, పట్టణ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, అధికార ప్రతినిధి బలవంత రావు, మాజీ ఎంపీపీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.