అక్షరటుడే, ఇందూరు: Telangana Formation Day | పారదర్శక పాలన వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోందని.. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఈరవత్రి అనిల్ (State Mineral Development Corporation Eravatri Anil) అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్(Police Parade Ground) మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. జిల్లాలో 700 కేంద్రాల ద్వారా 8.19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇందులో సన్నవడ్ల 7.25 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేశామన్నారు. అలాగే వీరికి రూ.500 బోనస్ చెల్లించామన్నారు. ఇప్పటివరకు కనీస మద్దతు ధర ప్రకారం రూ.18.99 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
Telangana Formation Day | భూభారతితో కీలక సంస్కరణలు..
భూభారతి చట్టంపై జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామని ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. జిల్లాలో మెండోరా(Mendora) మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Telangana Formation Day | ఇందిరమ్మ ఇళ్ల పథకం..
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో (Indiramma Housing Scheme) భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించి, అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నామని ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. జిల్లాలో 19,490 ఇందిరమ్మ ఇళ్లు లక్ష్యం కాగా.. 16,286 ఇళ్లు మంజూరు చేయబడ్డాయన్నారు. ఇప్పటికే 4,177 ఇళ్లకు మార్కింగ్ పూర్తయిందన్నారు.
Telangana Formation Day | మహాలక్ష్మి పథకం..
మహాలక్ష్మి పథకంలో (Mahalaxmi Scheme) భాగంగా జిల్లాలో 2.42 లక్షల మంది గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ విడుదల చేశామని ఎండీసీ ఛైర్మన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా మొత్తం రూ.30.73 కోట్లు చెల్లించామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 3.59 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారన్నారు.
Telangana Formation Day | గృహజ్యోతితో ఉచిత విద్యుత్..
జిల్లాలో 2.51లక్షల కుటుంబాలకు ప్రతినెలా జీరో బిల్లులు జారీ చేశామని ఈరవత్రి అనిల్ తెలిపారు. గృహజ్యోతి పథకంలో భాగంగా (Gruhajyothi) ఇప్పటివరకు ప్రభుత్వం రూ. 142.86 కోట్ల సబ్సిడీ అందజేసిందని వివరించారు. అలాగే నాయీబ్రాహ్మణ, రజకవృత్తుల్లో ఉన్న 323 మంది లబ్ధిదారులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు.
Telangana Formation Day | గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా..
గల్ఫ్ (Gulf) దేశాలకు ఉపాధి కోసం వెళ్లి మరణించిన 55 గల్ఫ్ బాధితుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించామన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున ఎన్నారై ఎక్స్‌గ్రేషియా కింద మొత్తం రూ.2.75 కోట్ల వారి ఖాతాలో జమ చేశామన్నారు.
Telangana Formation Day | యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు
జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ (Young India Integrated Residential) స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రెండో విడతలో బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి రూ.600 కోట్లు మంజూరయ్యాయని ఈరవత్రి పేర్కొన్నారు.
Telangana Formation Day | వనమహోత్సవం..
జిల్లాలో 2024-25కు గాను.. 42.061 లక్షల మొక్కలు నాటడానికి లక్ష్యం పెట్టుకుంటే 43.054 లక్షల మొక్కలు నాటి రికార్డు సృష్టించామన్నారు. అలాగే జిల్లా లో నేషనల్ హైవే 44, 63 రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్ 185 కిలోమీటర్లు మొక్కలు నాటడం జరిగిందని అనిల్ తెలిపారు.
Telangana Formation Day | వ్యవసాయంలో ప్రణాళిక బద్దంగా..
వర్షాకాలం సీజన్లో వ్యవసాయ శాఖ 5.61 లక్షలు ఎకరాల సాగు అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసిందని ఎండీసీ ఛైర్మన్ అన్నారు. ప్రధానంగా వరి 4.37 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 53 వేల ఎకరాలు సోయాబీన్ 37,000 ఎకరాలు, పత్తి 13వేల ఎకరాల్లో సాగు అవుతుందని అంచనాలు సిద్ధం చేశామన్నారు. 8,097 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్‌లో ఉంచామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ అంకిత్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Telangana Formation Day | అమరవీరుల కుటుంబాలకు సన్మానం
తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం రైతులకు విత్తనాలను అందజేశారు.