44
అక్షరటుడే, ఇందూరు: Pensioners | రాష్ట్ర అభివృద్ధికి సేవలందించిన పెన్షనర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Urban MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (Government Retired Employees Association) ఆధ్వర్యంలో క్రీడాపోటీలను సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెన్షనర్లకు కొన్నేళ్లుగా సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆరోగ్యం, ఐక్యత, సామాజిక స్ఫూర్తిని పెంపొందించేలా క్రీడా పోటీలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం ప్రతినిధులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.