HomeతెలంగాణEx Mla Jeevan reddy | రైతులను ప్రభుత్వం ఆగం చేస్తోంది..

Ex Mla Jeevan reddy | రైతులను ప్రభుత్వం ఆగం చేస్తోంది..

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్‌: Ex Mla Jeevan reddy | ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను గాలికొదిలేసి రాష్ట్రంలోని రైతులను ఆగం చేస్తోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు (BRS District President Jeevan Reddy), మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటను విక్రయిద్దామంటే, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అయినా ప్రభుత్వానికి రైతులంటే కనికరం లేకుండా పోయిందన్నారు. రబీ సీజన్‌ పోయి ఖరీఫ్‌ వచ్చినా ధాన్యం కొనే దిక్కులేదని, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సత్వరమే కొనుగోళ్లు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.